దావూద్ సోదరి మృతి... కడసారి చూపులకు డాన్ వస్తాడా?
భారత్ వ్యతిరేకి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ (54) గుండెపోటుతో కన్నుమూసింది. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. దక్షిణ ముంబయిలోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం హసీనాకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే, సోదరి కడసారి చూపులకు దావూద్ ఇబ్రహీం హాజరవుతాడా? అన్న విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు హసీనా అంత్యక్రియల వేళ ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉంది.
కాగా, హసీనా భర్తను 1991లో దావూద్ ప్రత్యర్థి అరుణ్ గావ్లీ ముఠా కాల్చి చంపింది. ఆ మరుసటి ఏడాదే తన బావను చంపిన వారిపై దావూద్ ప్రతీకారం తీర్చుకున్నాడు. దావూద్ గ్యాంగ్ 1992లో గావ్లీ ముఠా సభ్యుడు శైలేష్ హల్దాన్కర్ ను కాల్చి చంపారు.
అప్పట్లో ముంబయి పేలుళ్ళ తర్వాత దావూద్ పాకిస్థాన్ కు పారిపోయాడు. అప్పటి నుంచి భారత్ లో అతని ఆస్తులకు హసీనాయే బినామీ అని పోలీసువర్గాల అనుమానం.